ఓ మహమ్మారి చేసింది ననిప్పుడు ఒంటరి , ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టలెను నేనిప్పుడు.
రోజంతా మిత్రులతో గడిపే నేను , గత కొన్ని రోజులుగా ఒంటరినయి పోయాను.
సంతోషం , భాద నా ఒక్కడి సోంతం అయిపోయింది , ఎందుకో నాకు నా పుట్టుక గుర్తొస్తుంది , ఎందుకంటే నేను పుట్టడమే ఒంటరిగా పుట్టాను కదా.
జీవితంలో ఈ నిర్బంధన ఇంకెన్ని రోజులో తెలియదు కాని, ఈ ఒంటరి బతుకును నేను ఇంకా వేగలేను, నాకు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా శూన్యం గానే కనిపిస్తుంది.
ఓ మహమ్మారి మిత్రమా నాకు ఈ ఒంటరి ప్రపంచం నుండి విముక్తిని కలిగించరాదు, నాకు ఇంట్లో ఈ బంధి జీవితం వద్దు, నువ్వు ఈ ప్రపంచం ఎంత త్వరగా వీడితే నాకు నేను అంత త్వరగా ఈ ఒంటరి జీవితం నుండి స్వేచ్ఛ పరుడిని కాగలను
©️AKASHRAJ